ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

1) పొరపొచ్చలు లేని స్నేహం,అలక చూపని ఇల్లాలు,చీకాకులు ఎరుగని దాంపత్యం ఉత్తుత్తి మాటలే. అడ్డులెన్ని వచ్చినా అధిగమించటమే శ్రేయం మరియు అనుసరణీయమైన కళ.

2) పగవాడు లేక మొనగాడుగా తెలియబడవు, సరైన జోడీ లేక జతగాడుగా రాణించవు, ఫలితాలు చూపక ప్రజ్ఞ కలవాడిగా గుణించబడవు
 


(PS..పరుగులెత్తే మనసుని నిలువరించడం కష్టం అందుకే దాన్ని ముందే నిలువరించవలే)

No comments: