ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

Photo: మదికోరికను ఎదప్రేమను దాచలేకపోయానని బాధతో 
వలచినాక వలచానని తెలపలేకపోయానని వంకతో 

త్రాకనియ్యి లేలేత పెదవులుని ఈ గ్లాసుని 
త్రాగనియ్యి గుండెల్ని మండించే ఈ ద్రవాన్ని 

నిజాలని చెప్పేటందుకు ఈ మందే మందు 
నిజాలని నిజాయితిగా ఒప్పేందుకు యిదే మందు 

పేదవాడైన గొప్పోడైన ఒకేలా తీర్పిచ్చేది ఈ మందు 
పేదవాడి తెగువకు గొప్పోడి నిర్లజ్జతకు ప్రధానమైనదీ మందు 

నమ్మకాలకు ఇచ్చిన మాటలకు తిలోదోకాలు యిప్పేంచేదీ మందు   
బ్రతుకు ఫలకంపై చివరి పేరాలో పశ్చాతాపం రాయించేదీ మందు  

ఇన్నీ సుద్దులు బుద్దులు చెప్పినా వినక త్రాగితే నీ ఇష్టం
ఇవన్నీ మామూలేనుకుని అడుగు ముందుకువేస్తే బ్రతుకవ్వు కాష్టం 
.........
విసురజ

మదికోరికను ఎదప్రేమను దాచలేకపోయానని బాధతో

No comments: