ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 September 2013

1) ఏదన్న సాధించాలంటే తీవ్రమైన తపనుంటే సరిపోదు, దానికి తగ్గ సాధన సంపత్తి అలవర్చుకోవాలి. నిరంతర పరిశ్రమ, సాధనతో నైపుణ్యం చేకూరు. నైపుణ్యంతో తపనపడే చేయతగ్గ పనిని అవలీలగా సాధించగలుగుతారు.

2) భాతృప్రేమ, మాతృప్రేమ, సోదరి అనురాగం, తండ్రి మమకారం ఇవన్నీ అంగట్లో అమ్మబడే సరుకులు కావు.. వీటి విలువ ఎనలేనిది.. మన నడవడికతో వాటి విలువను పరిరక్షిచుకోవాలి, పెంపొందించాలి గాని అటువంటి వాటి పట్ల ఏహ్యభావం ఏర్పడకుండా మెలగాలి.
 


(PS..రేపు గురించి అలోన్చించి చేతిలో వున్ననేడుని పాడు చేసుకోకు)

No comments: