
కవిత: ప్రేమ = ?
మదిలోని మాటను చెప్ప జంకేదే....ప్రేమ
ఎదలోని భావాన్ని వ్యక్తపరచాలని తపన పడేదే....ప్రేమ
తరిమే ఎడదను మమతే తడిమి సరాగామాడితే
ఉబికివచ్చే రాగమే అనురాగం, దాని మరో పేరే...ప్రేమ
మది భావాల సంద్రంలో చిక్కితే
వలపే చుక్కానిగా చేసుకుని
మనుసు మెచ్చి చేరు తీరం పేరే....ప్రేమ.
...........
విసురజ
No comments:
Post a Comment