ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 September 2013

1) ద్రౌపదికి బట్టిచ్చినవాడు గోవిందుడే/గోపాలుడే అలాగే గోపికల బట్టలెత్తుకెళ్ళినవాడు గోవిందుడే/గోపాలుడే. ద్రౌపదిని కాచినప్పుడు మాన సం రక్షకుడు..నారాయణుడు అంటాం మరదే గోపికా వస్త్ర సంగ్రహ విషయంలో మరి ఆ నారాయణుడినే వస్త్ర చోరుడు /దొంగ అంటాం.. దేశ కాల మాన పరిస్థితులు, చూసే కళ్ళు, చెప్పే నోరు బట్టి విషయ వివరణ జరిగేను. మంచైనా చెడైనా, కలతైనా, మోదమైనా అన్నీ ఆ దేవదేవుడు..శ్రీక్రుష్నుడి లీలలే.

2) పాత రోజులను, గత సంగతులను తలుచుకుంటూ అక్కడనే వుండిపోతే జీవనంలో గమనం కష్టమవ్వే, మనుగడ మ్రుగ్యమయ్యే. గతం నుంచి అనుభవాన్ని నేర్చి వర్తమానంలో వర్తిష్యమానంలోని వ్యవహారాలలో వాడి, మీ వాడి చూపి, జయం పొందండి.

Photo Photo

(PS....ఎద స్వచ్ఛంగుంటే వదనం కళగా తళ తళగా మెరిసేగా)

No comments: