
కవిత: లీలాక్రిష్ణ భజేహం
...........................
పుట్టకేమో చీకటి చెరసాలలో, దేవకి సుతుండై
హరివి కంస ప్రాణహరుండవైతివి చిన్నిక్రిష్ణ
పెరిగింది అనురాగ బ్రుందావనంలో, నంద సుతుండై
ప్రణయానివి గోపిక మానసహరుండవైతివి లీలాక్రిష్ణ
ముసి ముసి నవ్వులతో వెన్నదోచే
చిలిపిదొంగవి నీవు చిన్నిక్రిష్ణ
ముద్దు ముద్దు నడకలతో ప్రేమపంచే
మోహనరూపానివి నీవు లీలాక్రిష్ణ
బాలరూపుతో దేవా చిన్నిక్రిష్ణ
బహుదొడ్డ ఘనకార్యాలు చేసేవు
విరాటరూపుతో దేవా లీలాక్రిష్ణ
కిరీటికి గీతాసారామ్రుతం త్రావించేవు
గోటితో గోవర్ధన పర్వతం
చిటికెలో ఎత్తేవు చిన్నిక్రిష్ణ
గోవిందా గోవిందాయని పిలువా
గబగబా తరలోచ్చి కరిని బ్రోచేవు లీలాక్రిష్ణ
ఇంట్లోనే క్షణకాలంలోనే నోటిలోనే
తల్లి అశోదకు ముల్లోకాలు చూపించేవు, చిన్నిక్రిష్ణ
కౌరవ సభలో ఆర్తిగా చెయ్యేత్తి మొక్కంగానే
ద్రౌపది మాన సం రక్షణ గావించేవు, లీలాక్రిష్ణ
ప్రేమకు అనురాగ ఆలంబనకు ఆత్మవి
పట్టుకొమ్మవి పెద్దదిక్కువి నీవు, చిన్నిక్రిష్ణ
రాధారమణి వలపును గెలిచిన శ్రీనాధుడివి
స్వార్దరహిత ప్రేమను గెలిపించింది నీవే, లీలాక్రిష్ణ
..........
విసురజ
No comments:
Post a Comment