ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

Photo: కవిత: వీడి వెళ్లకు ప్రియా 
.........
వీడి నను వెళ్ళమాకు ప్రియా
మొహంతో నీ ప్రేమదాహంలో 
నా మనసింకా నిండలేదు ప్రియా 
.........
సగంలోనే ప్రేమల్నాపి నీవు వెళ్ళిపోతే ప్రియా 
భీతిల్లే నా మనసు గతేమౌను 
వలపే అనాధవ్వేను ప్రియా 
.........

మరుల్లో చిక్కిన మనసుకు 
నీ దర్శన ఆకలి ఎక్కువయ్యే ప్రియా
నీ చూపుల అల్లికలో అనురాగం తొణికిసలాడే ప్రియా 
.........
నవ్వుల పువ్వులతో ఎదకన్నుల వెన్నెలతో 
సొయగాల వలపు పరిమళ భరితమయ్యే ప్రియా
అలవి లేని అమరప్రేమ రాగ రంజితమయ్యే ప్రియా 
........
వీడి నను వెళ్ళమాకు ప్రియా
నీ ప్రేమదాహంలో మొహంతో నా మనసింకా నిండలేదు ప్రియా 
.......
విసురజ
(ఈ కవిత "అభి నా జావో చోడ్కర్ కే అభి దిల్ నహి బరా" అంటూ సాగే హందోనో హిందీ సినిమాలోని పాట పల్లవితో మొదలు పెట్టి రాసా. చదివి మీ అభిప్రాయం చెప్పగలరు)

 కవిత: వీడి వెళ్లకు ప్రియా
.........
వీడి నను వెళ్ళమాకు ప్రియా
మొహంతో నీ ప్రేమదాహంలో
నా మనసింకా నిండలేదు ప్రియా
.........
సగంలోనే ప్రేమల్నాపి నీవు వెళ్ళిపోతే ప్రియా
భీతిల్లే నా మనసు గతేమౌను
వలపే అనాధవ్వేను ప్రియా
.........

మరుల్లో చిక్కిన మనసుకు
నీ దర్శన ఆకలి ఎక్కువయ్యే ప్రియా
నీ చూపుల అల్లికలో అనురాగం తొణికిసలాడే ప్రియా
.........
నవ్వుల పువ్వులతో ఎదకన్నుల వెన్నెలతో
సొయగాల వలపు పరిమళ భరితమయ్యే ప్రియా
అలవి లేని అమరప్రేమ రాగ రంజితమయ్యే ప్రియా
........
వీడి నను వెళ్ళమాకు ప్రియా
నీ ప్రేమదాహంలో మొహంతో నా మనసింకా నిండలేదు ప్రియా
.......
విసురజ
(ఈ కవిత "అభి నా జావో చోడ్కర్ కే అభి దిల్ నహి బరా" అంటూ సాగే హందోనో హిందీ సినిమాలోని పాట పల్లవితో మొదలు పెట్టి రాసా. )

No comments: