
కవిత: ఏమి కావాలఖ్ఖర్లేదూ
........................
పరవశించే మనసుకి
పరిమళాల సుగంధాలు అఖ్ఖర్లేలేదు
ఉపసించే తాపసికి
విందుభోజనాల అహ్వానాలతో పనిలేదు
నిరసించే జననేతకి
ప్రలోభాల సుమహారాలపై మక్కువుండదు
నినదించే అధికజనాల్కి
రోడ్డెక్కిన విషయంపై గ్రహింపు వుండదు
వర్షధారల మేఘానికి
ఇక్కట్ల పాలయ్యే పేదోళ్ళ గోడు పట్టదు
సునామీల కెరటాలకి
బెస్తగాళ్ల జీవితాలపై కరుణ వుండదు
పలకరించే పరువానికి
ప్రాయంతో తప్ప పేదా గొప్పలతో పనిలేదు
సామాన్యుడి బ్రతుకుకి
విభవాలతో వైభవాలతో పనివుండదు
ప్రేమించే మంచిమనిషికి
విరోధాల భావనలతో పనిలేదు
రూపవతే శత్రువైతే
పాతాళంలో దాక్కున్న దండన తప్పదు
ప్రియభార్యే గుణవతైతే
కష్టాలసంద్రము పాలసంద్రంకాక తప్పదు
.............
No comments:
Post a Comment