ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

Photo: కవిత: ప్రేమ వ్యధ 
......
మనసే కవియైతే బాధలే కవితలవ్వవా  
మమతే మసిచేస్తే బ్రతుకే భారమవ్వదా 
వలపు పరుగులో ప్రణయవేదనే ప్రణవనాదమయ్యే         

ప్రేమేమి బొమ్మలాట కాదులే 
ప్రేమకై వాదులాట ఎందుకులే 
వలపు గొడవలలో తెలియక తొందరపడితే వెతలపాలయ్యే      

ఎదలో తపన తరిమినా నువ్వు ఆగకపోతే 
మదిలో ఊహలు తడిమినా నిను చేరకపొతే
వలపు ఊటలలో తీయని మధురిమ కరువయ్యేలే  

మనసే వలపురాగం పాడినా నువ్వు వినకపోతే 
వయసే కోరికలగుర్రం ఎక్కినా నిను అందకోకపోతే 
మనసు వయసుల సరిగమల సంగీతం శూన్యమైపోయేలే  
...........
విసురజ

కవిత: ప్రేమ వ్యధ
......
మనసే కవియైతే బాధలే కవితలవ్వవా
మమతే మసిచేస్తే బ్రతుకే భారమవ్వదా
వలపు పరుగులో ప్రణయవేదనే ప్రణవనాదమయ్యే

ప్రేమేమి బొమ్మలాట కాదులే
ప్రేమకై వాదులాట ఎందుకులే
వలపు గొడవలలో తెలియక తొందరపడితే వెతలపాలయ్యే

ఎదలో తపన తరిమినా నువ్వు ఆగకపోతే
మదిలో ఊహలు తడిమినా నిను చేరకపొతే
వలపు ఊటలలో తీయని మధురిమ కరువయ్యేలే

మనసే వలపురాగం పాడినా నువ్వు వినకపోతే
వయసే కోరికలగుర్రం ఎక్కినా నిను అందకోకపోతే
మనసు వయసుల సరిగమల సంగీతం శూన్యమైపోయేలే 

No comments: