
కవిత: పెళ్ళి విభవము
..........
ప్రణయాలే పరిణయాల ముంగిలిలో ఓణి పరికిణి ప్రేమరాజుతో జతవ్వే
కరములే కూడి మనసులే జతపడి వలుపే కుదరగా మదిలో కలలే కౌగలించే
కన్నులే కలబడంగా మనసులో నిలిచిన సుమశరుడే వరుడై నిలబడే
రతీరమణి సాటి పడతి మోములో కుసుమించిన సిగ్గుముగ్గే బుగ్గచుక్కై మెరిసే
నుదట భాసికాలతో మెడలో మల్లెల మరువాల మాలలతో వధువరులు మురిసే
పట్టుబట్టలే పెళ్ళిపందిరిని పలకరించ వధువరులే అందంగా ముస్తాబయ్యే
విపంచి విరచించిన అనురాగమే విరిసి నూతన జంట బ్రతుకే అందంగా పండే
No comments:
Post a Comment