
గుండె బేజారైన కష్ట వేళ
మనోనిబ్బరాన్ని అందించేదే..మిత్రత్వం
బ్రతుకు భారమైన కష్టంలో
నేనున్నంటూ చెయ్యందించేదే..స్నేహం
ఎటుతోచని అయోమయంలో
మార్గదర్శై లైఫ్ ని నడిపించేదే...నెయ్యం
వ్యధల ఊబిలో పడిపోతే
బురదలోంచి పైకిలాగే తాడే... ఫ్రెండ్ షిప్
ఓపిక కరువైన టైములో
తనే ఊతంగా వుండి ఒడ్డుకుచేర్చేదే... దోస్తీ
.......................
విసురజ
No comments:
Post a Comment