ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైనాలుగవ అంకం
 

 షిర్డీ సాయిబాబా ఆజ్ఞ మీరి షిర్డీ వదలలేరు. సాయిబాబా ఆజ్ఞను మీరితే అనుకోని, చెప్పలేని కష్టాలు అనుభూతయ్యే. షిర్డీ విడిచి వెనక్కి వెళ్ళడం కోసమైనా, లేక వేరే పని కోసమైనా, సాయిబాబా ఆజ్ఞను పొందుటకు వెళితే సాయిబాబా కొన్ని సలహాలు నర్మగర్భంగా లేక ఒకో మారు సూటిగా యిచ్చుచుండే. సాయిబాబా సలహా ప్రకారం నడచినచో లాభాము, సుఖము భక్తులు పొండుచుండే. వారి మాటను గౌరవించకపోతే, ప్రమాదాలేవో తప్పక వచ్చుచుండే. అటువంటి అనేకమైనవి వున్నా వాటిలో రెండు తార్కాణాలు క్రింద విధంగా వుండే.

1)
తాత్యాకోతే పాటీల్ టాంగాలో ఒకమారు కోపర్ గాం సంతకు వెళ్ళదలచే. మసీదుకు వచ్చి సాయిబాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు వెళ్ళుచున్నానని, తొందరలో వున్నానని చెప్పే. అంత సాయిబాబా "తొందరపడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి మాట అటుంచు. పల్లె విడిచి బయటకు పోవద్దు." మాట వినక కంగారు పడుతున్న తాత్య కోటే పాటిల్ ని చూచి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని వెళ్ళమని" సాయిబాబా ఆజ్ఞాపించే. అది లెక్కచేయక తాత్యా వెంటనే టాంగాను బయలుదేరదీసే.. ఆ టాంగాకున్న రెండు గుర్రాలలో ఒకటి కొత్తది పైగా మిక్కిలి చురుకైనది. షిర్డీ ఊరవతల వున్నా సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తి, ఆపై దాని కాలు బెణికి మూలబడే. క్రిందపడ్డ తాత్యాకు పెద్దదెబ్బలు తగలలేదు. అప్పుడు గాని సాయిబాబా ఆజ్ఞను దాని విలువను
తాత్య కోటే పాటిల్ గుర్తించలేదు.

2)
ఒకసారి బొంబాయనుండి యూరప్ దేశస్థుడు షిర్డీ వచ్చే. నానా సాహెబ్ చాందోర్కరు వద్ద నుంచి ఒక సిఫార్సు లేఖతో సాయిబాబాకై వచ్చే. అతనికి ఒక మంచి బస నేర్పాటు చేసిరి. అతడు సాయిబాబా పాదాలకు నమస్కరించి వారి చేతిని ముద్దాడాలని మూడుసార్లు మసీదులో ప్రవేశించ కోరే. కాని సాయిబాబా అతనిని రాకను నిషేధించెను. అందరిలా క్రింద బహిరంగ ఆవరణములో కూర్చుండియే దర్శించమనిరి. అతడు తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిర్డీ విడవాలని నిశ్చయించే. సాయిబాబా సెలవు కోరే. అతనిని తొందరపడక మరుసటిదినం వెళ్ళమని సాయిబాబా తెలిపే. వారి సలహాకు వ్యతిరేకంగా అతడు టాంగాలో షిర్డీ నుండి బయలుదేరే. మొదట్లో గుర్రాలు బాగానే వున్నా షిర్డీ ఊరవతల వున్నా సావుల్ బావి దాటిన వంటనే ఆ టాంగాకు మరో త్రొక్కుడుబండి ఎదురోచ్చే. దానిని జూచిన గుర్రాలు బెదిరి త్వరగా పరుగు పెట్టండంతో టాంగా తలక్రిందులయ్యే. యూరప్ పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము యీడ్వబడే. తత్ఫలితంగా అతగాడు కోపర్ గాం ఆసుపత్రిలో గాయాల మానువరుకు ఉండవలసివచ్చే.
ఇటువంటి అనేక సంఘటనల మూలాన సాయిబాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదాల పాలగుదరని సాయిబాబా ఆజ్ఞానుసారం నడిచేవారు సురక్షితంగా ఉంటారని భక్తజనులు గ్రహించే.
.................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: