ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 4 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైరెండవ అంకం

సాయి పాదుకల వృత్తాంతం
అక్కల్ కోటకర్ స్వామి మహారాజ్ గారి భక్తుడైన భాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ స్వామి మహారాజ్ గారి ఫోటోను పూజిస్తుండే. షోలాపూరు జిల్లాలోనున్న అక్కల్ కోట గ్రామానికి పోయి స్వామి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించాలని తలచే. అప్పుడు అతడికి స్వప్నంలో అక్కల కోటకర్ స్వామి మహారాజ్ దర్శనమిచ్చి "ప్రస్తుతం షిర్డీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ నెరవేర్చు" అని తెలిపే. అలా 1912వ సంవత్సరం బొంబాయి నుండి రామారావు కొఠారి అనే డాక్టర్ వారి మిత్రుడుతో పాటు డాక్టర్ గారి కాంపౌండరైన భాయి కృష్ణజీ షిర్డీ వచ్చే. భాయి కృష్ణజీ షిర్డీ చేరి సాయిబాబాను పూజించే. అచ్చటనే ఆరునెలలు ఆనందముతో ఉండిపోయే. ఒకనాడు సాయిబాబా దర్శనం చేసిన తరువాత అక్కల్ కోట గ్రామానికి పోదలచి సాయిబాబా వద్దకు వెళ్లి అనుమతి కోరే. సాయిబాబా యిట్లనే "అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడకు ఎందుకు వెళ్ళడం? అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం యిక్కడే వున్నారు, అది నేనే". ఆ విషయం మనసున గట్టిగా నమ్మిన భాయి కృష్ణజీ అక్కల్ కోటకు ఆపై వెళ్లుట మానుకొనే. డాక్టర్ కొఠారి, అతని మిత్రుడు మరియు కాంపౌండర్ భై కృష్ణజీ షిర్డీలో భక్త సగుణుతోను, శ్రీ జి. కె. దీక్షిత్ తోను మిక్కిలి స్నేహం చేసిరి. వారి వారి ధర్మపూరిత చర్చల్లో సాయిబాబా మొట్టమొదటగా షిర్డీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్ధం సాయిబాబా వారి పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించాలని తలచే. వారు ముందు పాదుకలను రాతితో చెక్కించ నిశ్చయించబోవ కాంపౌండరైన భాయి కృష్ణజీ తమ డాక్టరైన రామారావు కొఠారికి కలిసి విషయం చెప్పినచో వారి వంతు సహకారం అందించి చక్కని పాదుకలు చెక్కిస్తారని చెప్పే. అందరు ఈ సలహాకు సమ్మతించి డాక్టరుగారిని కలిసి ఈ పాదుకల స్థాపించే విషయం తెలియపరచిరి. దానికి ఒప్పిన డాక్టర్ గారు పాదుకల నమూనా వ్రాయించి 'ఖండోబా' మందిరంలో ఉంటున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి ఆ నమూనాను చూపే. దాన్ని చూసిన
ఉపాసనీ మహారాజ్ గారు ఆ నామూనాలో కొన్ని మార్పులను జేసి, పద్మం, శంఖం, చక్రం మొదలగునవి చేర్చి సాయిబాబా యోగశక్తిని మరియు వేపచెట్టు గొప్పతనాన్ని తెలిపే యీ క్రింది శ్లోకాన్ని పాదుకలపై చెక్కమనే.
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం|
ఉపాసని మహారాజ్ సలహాను ఆమోదించి పాదుకలను బొంబాయిలో చేయించి డాక్టర్ కొఠారి తన కాంపౌండరైన భై కృష్ణజీ ద్వారా షిర్దికి పంపిరి. వాటిని స్థాపన కొరకు మంచి రోజుకై సాయిబాబాను సంప్రదించ శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని సాయిబాబా ఆజ్ఞాపించే. నాటి శ్రావణ పౌర్ణమి నాడు వుదయం 11 గంటలకు తన శిరస్సుపై ఈ పాదుకలు పెట్టుకొని శ్రీ జి. కె. దీక్షిత్ ఖండోబా మందిరం నుండి షిర్డీ సాయిబాబా వుండే ద్వారకామాయికి ఊరేగింపుగా ఉత్సవంగా తరలి వచ్చే. ఆ పాదుకలను తాకి సాయిబాబా
అవి భగవంతుని శ్రీ పాదుకలని వాటిని వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించమని ఆదేశించే. దాదా కేల్కర్, ఉపాసనీబాబా ఆ ప్రతిష్ట పూజను శాస్త్రోక్తముగా జరిపే. ఆ శ్రావణ పౌర్ణమికి ముందురోజు షిర్డీ సాయిబాబా భక్తుడు పార్సీ మతస్థుడైన పాస్తాసేట్ బొంబాయి నుంచి మనియార్డర్ ద్వారా రూ.25 పంపా ఆ పైకం మొత్తం సాయిబాబా పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తమిచ్చే. నాటి దినం ఆ పాదుకల స్థాపనకై మొత్తంగా రూ.100 ఖర్చవ్వే మిగిలిన రూ.75 వరకు చందాల ద్వారా పోగు చేసిరి. ఆ వేపచెట్టు క్రింద పాదుకలను మొదటి 05 సంవత్సరాలు శ్రీ జి.కె.దీక్షిత్ అనే భక్త బ్రాహ్మణుడు పూజ చేసే. ఆ తరువాత లక్షణ్ కచేశ్వర్ జఖాడనే మరో భక్త బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేసే. అలాగే పాదుకల నిత్యపూజ సరిగ్గా జరుగుతున్నదో లేదోనన్న విషయం పర్యవేక్షించు అధికారం
భక్త సగుణుకు లభించే. ఆ పూజ నిమిత్తం మొదటి 5సంవత్సరాలు డాక్టర్ కొఠారి నెలకు రూ.2 చొప్పున పాదుకల దీపపు ఖర్చుకై పంపుచుండే. పాదుకల చుట్టు కంచే కూడ డాక్టర్ కొఠారి బొంబాయి నుంచి రైలులో పంపే. ఈ కంచెను, పాదుకల పైకప్పును కోపర్ గాం రైలుస్టేషన్ నుండి షిర్డీ గ్రామంకి తెచ్చుటకైన రూ.7-8-0 ఖర్చును భక్త సగుణు సరిపుచ్చే.
............................
శాంతిః శాంతిః శాంతిః।
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।।
శుభం భవతు।

No comments: