
నీలాపనిందలు కాసినవాడు
ఆలుమందలను కాచినవాడు
వెన్నదొంగిలించే నెమలీకధరుడు
నింగినీలమంత విశాలహ్రుదయుడు
కోకలెత్తుకెళ్ళిన కొంటెప్రియుడు
వెదురుతోనే వుల్లమునలరించేవాడు
దుస్తులిచ్చిన ద్రౌపదిమానరక్షకుడు
గీత చెప్పి జీవితగీతల్ని మార్చినవాడు
ప్రేమకు ప్రేమను నేర్పినవాడు
దరిద్రుల దాతల ధర్మపక్షకుడు
జగమేలువాడు జగానికొక్కడు
కొండంతదేవుడు శ్రీక్రిష్ణుడు
No comments:
Post a Comment