ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

PhotoPhoto

కవిత: ప్రేమ కిక్కు 
.....................
కురులుతో ముంగురులతో కవ్విస్తున్నావే 
కోలమోముతో కులుకులతో కిర్రేక్కుస్తున్నావే 
నునుపైన నుదురుతో నన్నలానమిలియ్యేకే 
చేపకళ్ళతో కళ్ళాపిజల్లి చిన్నబుచ్చమాకే 
నీటైన నాసికతో నన్నలాఘ్రాణించకే
చెంపలను చారడేసేసుకుని చిత్తగించకే
పెదాల ప్రమోదపరవళ్ళతో పోటేయ్యమాకే
పలుకు పరవశాలతో కట్టిపడెయ్యమాకే
చుబకపు చురకత్తులతో చిత్తుచెయ్యమాకే
కొంగమెడతో కసిదీరా కోసేయ్యమాకే
XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
నాభికమల అందాలతో నలిపెయ్యమాకే
నడుం నాజూకులాస్యాలతో నిలదీయమాకే
నడకల నైపుణ్యలావణ్యాలతో నెట్టెయ్యమాకే
అందంగా మొత్తంగా గుత్తంగా సొకులన్నీ అందిపుచ్చుకున్నావే
సొగసులసుందరి సింగారరసఝరి సముద్రపలలా సుట్టేత్తున్నావే

(ఈ కవిత చిన్నప్పుడు ఎప్పుడో కళాశాల రోజులలో రాసింది.. చాన్నళ్ళకు ఈ మధ్యనే దొరింకింది.. దాంట్లో కొంత భాగమే పెడుతున్నా, కొంత సెన్సార్ చేసినా..)

No comments: