
కవిత: స్నేహ వర్ణాలు
.......................
కయ్యంతో వియ్యం అందడమదేలా మనసా
పదుగురు మెచ్చే నెయ్యమే పదివేలు తెలుసా మనసా
నెయ్యమనే భావం మదిలోని పదిలమైతే మనసా,
ఆడమగ బేధాలు చూపని మనసే ఉన్నతంగా మనసా
స్నేహం అమరత్వానికి నిజమైన చిహ్నం
స్నేహం అనురాగానికి సత్యమైన నిదర్శనం
స్నేహం అద్భుతాలకు తావిచ్చే యంత్రం
స్నేహం బంధువులను మరిపించే మంత్రం
కన్నుల కొలనులో ఆశ్రువుల ఈదులాటలు
జ్ఞ్యాపకాల వీధిలో తలపుల తడుముటలు..
రెండు కలిసొచ్చే ఎండా వానాల్లాంటివి
పండు వెన్నలలో రేగే వేడి నిట్టూర్పుల్లాంటివి
మరుల పూలతో మనోహర ప్రణయమాల వేసుకున్నా
మాటల ముత్యాలతో ధవళవర్ణ దండలు నేసినా
మనసుల కలయకతో సప్తవర్ణ చిత్తాలే చిత్రించా
మమతల కోవెలలో సరిగమ సంగీతగమకాలే చిత్తగించా
........
విసురజ
(Co written by వసంత శ్రీ గారు)
.......................
కయ్యంతో వియ్యం అందడమదేలా మనసా
పదుగురు మెచ్చే నెయ్యమే పదివేలు తెలుసా మనసా
నెయ్యమనే భావం మదిలోని పదిలమైతే మనసా,
ఆడమగ బేధాలు చూపని మనసే ఉన్నతంగా మనసా
స్నేహం అమరత్వానికి నిజమైన చిహ్నం
స్నేహం అనురాగానికి సత్యమైన నిదర్శనం
స్నేహం అద్భుతాలకు తావిచ్చే యంత్రం
స్నేహం బంధువులను మరిపించే మంత్రం
కన్నుల కొలనులో ఆశ్రువుల ఈదులాటలు
జ్ఞ్యాపకాల వీధిలో తలపుల తడుముటలు..
రెండు కలిసొచ్చే ఎండా వానాల్లాంటివి
పండు వెన్నలలో రేగే వేడి నిట్టూర్పుల్లాంటివి
మరుల పూలతో మనోహర ప్రణయమాల వేసుకున్నా
మాటల ముత్యాలతో ధవళవర్ణ దండలు నేసినా
మనసుల కలయకతో సప్తవర్ణ చిత్తాలే చిత్రించా
మమతల కోవెలలో సరిగమ సంగీతగమకాలే చిత్తగించా
........
విసురజ
(Co written by వసంత శ్రీ గారు)
No comments:
Post a Comment