
కవిత: ప్రేముత్తరం
.....................
పదాల పూలతేనే అద్ది పంపాడో
వలపు కధనాల కతనే తెలిపాడో
ప్రాయాల పక్వాలకు పూలే జల్లాడో
వయసే పరువాల పానుపే పరచాడో
నునుపు లావణ్యాల లాస్యాలకు బద్ధుడో
సఖీ ప్రాణేశ్వరి ప్రియాంటూ గోముగా పిలిచాడో
తాళలేనిక జాగుచేయక చదివి చెప్పవే చెల్లి
మదిష్టపడే సఖుని మనసుగుట్టు విప్పవే చెల్లి
No comments:
Post a Comment