
కవిత: ఔనా..నిజమేనా
.......................
ఎంతటి బడబాగ్నినైనా కష్టిస్తే ఆర్పగలవేమోగాని
సముద్రాలు నదులన్నిటిని కలిపి గుమ్మరించినా
మనసున జ్వలించే ప్రేమాగ్నిని ఆర్ప సాధ్యమగునా
విరహమే వేదించి వధించే మనసుకు నెమ్మదగునా
తొలితొలిలో వడివడిగా అడుగిడే
పదహారేళ్ళ కోరవయసుకు వందనం
ముద్దుముద్దుగా మత్తుమత్తుగా పలకరించే
నవలావణ్యాలిచ్చే దోరవయసుకు వందనం
తలపుల మలుపుల్లో తనువు తచ్చట్లాడేవేళ
అందీ అందని తీపి మనసు తడిమితే అమరం
పెదవుల గులాబీల్తో మధువు ముచ్చట్లాడేవేళ
అల్లరి గిల్లరి చేసే ప్రాయమే తరిమితే అమరం
మనసు నేర్చిన ప్రతి అక్షరము వెలుగు దీపమే
వలపు తెలిపిన ప్రతి ఉదయము కాంతి పుంజమే
.............
విసురజ
No comments:
Post a Comment