ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

Photo: కవిత: ప్రేమ పలవరింపు 
............................
నిండు జాబిలే ఈర్ష్యపడే అందం నీదేలే 
లావణ్యానికే లావణ్యం అరువిచ్చే సొబగు నీదేలే 

నీలాల నింగిలో మెరిసిన విద్యుల్లతా దివ్వెవి నీవేలే 
ప్రాయాల పుంతలో విరిసిన తనుల్లతా ముదితవి నీవేలే 

చరించే మనసుకు అనురాగ రసస్పందనలు నేర్పింది నీవేలే 
నర్తించే వయసుకు ముదమున నవరాజభోగాలు ఊసిచ్చింది నీవేలే 

సరసాల సరాగ రాగమంజరి మనోహరి 
కన్నెత్తి వెనుదిరిగి నను చూడవ దరి చేరరావా మనసు మురియ 

సొగసుల శ్రీలత నవ్యసుందరి సుహాసిని 
ప్రేమతో చెంతచేరి నను పాలింపవా నను లాలింపవా వయసు విరియ 
........
విసురజ

కవిత: ప్రేమ పలవరింపు 

No comments: