
కవిత: ప్రేమంటే
............
ఎదలో తలవడం
ఎదను తరమడం
ఎదలో ప్రకంపనం
ఎదకు పరిమళం
ఎదలో కలవరం
ఎదకు కమనీయం
ఎదల నిమజ్జనం
ఎదను నిమరడం
ఎదలో ప్రకాశం
ఎదకు పరవశం
ఎదలు మమేకవడం
ఎదకు మంత్రమేయడం
ఎదలో అత్మల సంగమం
ఎదకు అనురాగ తోరణం
ఎదలో ప్రశ్నల శరాఘాతం
ఎదకు పూజ పునస్కారం
ఎదలో వలపువాన కురవడం
ఎదకు వయసుపిలుపు అందడం
ఎదలో కులాలకంపును ఎరివేయడం
ఎదకు కష్టాలరిష్టాలను ఎదిరించడం
ఎదలో కురిసిన వలపు వర్షం
ఎదకు కల్పనల సైకత శిల్పం
ఎదలో మెరుపుల విరిసే వనం
ఎదకు మధువుల చిలికే రసం
........
No comments:
Post a Comment