ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 26 December 2013

PhotoPhotoPhoto

స్వగతాలు
..............
అగస్ట్ ఒకటిన, 1967లో నేను పుట్టింది కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్టణంలో.. 
నిండు గర్భిణిగా మా మాత్రుమూర్తిగారు విశాఖపట్టణంలోని కొత్త రోడ్ నందు గల జగన్నాధ స్వామి దేవాలయమునకు జగన్నాధ స్వామి తిరునాళ్ళ అంటే రధయాత్ర రోజులలో వెళ్ళారంటా...
ఆ తరువాతే నేను పుట్టినందుకు నాకు జగన్నాధ్ అని పేరు పెట్టినారని మా పెద్దలు తెలిపితే విని చాలా సంతోషించా.

దేశంలోని అన్నీ ముఖ్య ప్రదేశాలు అంటే జమ్మూ, కాశ్మీర్, షిల్లాంగ్, అస్సాం, గుజరాత్, ద్వారక, పూరి, భువనేశ్వర్, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, అహ్మాదాబాద్, జోధ్పూర్, జైపూర్, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, మిజోరాం, అమ్రుతసర్, ఛండీగర్ అలాగే నేను వుండే డిల్లీ తొ సహా అన్నీ విపులంగా చూసా..అబ్బే మా విశాఖాపట్టణం అంత సుందర ప్రదేసం మరోటి కనిపించలా. ఆ వాతావరణం, ఆ అహ్లాదం, సముద్రం పైనుంచి వచ్చే ఆ సాయాంత్రపు చల్లని చిరుగాలి మనసుని మనిషిని సమ్మోహితం చేసేగా.

విశాఖపట్టణం మాహా సుందర ప్రదేశం. చల్లని గాలులిచ్చే రామక్రిష్ణ బీచ్, పురాతన లైట్ హవుస్, ఎత్తు పల్లాలున్న రోడ్డులు, సిటీకి దూరంగా వుండే వేంకటేశ్వర స్వామి మందిరం, డాల్ఫిన్ నోస్ సముద్రంలోకి చోచ్చుకు పోవడంతో ప్రాక్రుతంగా ఏర్పడిన నేచురల్ హార్బర్ , కొండ కొనల మధ్య కార్తీక మాస వనభోజన విహార యాత్ర స్థలమైన సీతమ్మధార (అక్కడే గవర్న్మెంట్ క్వార్టర్స్ లో మేముండేవాళ్ళం). గట్టిగా ఎండ వుంటే సయంత్రానికే వాన కురిసే సుందర ప్రదేశం. అటు అరకు, ఇటు భీమిలి, పక్కనే సింహాచల పుణ్యక్షేత్రం..అసీలుమెట్ట దగ్గర సంపత్ వినయక స్వామి గుడి, జగదాంబ సెంటర్, కూరగాలమ్మే పూర్ణ మార్కెట్ (పూర్ణ సినిమా హాల్ పేరు మీద వెలిసిన మార్కెట్), అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే కూర్పా మార్కెట్ పక్కనే కోరకనే వరాలిచ్చే కనకమహలక్ష్మి తల్లి దేవాలయం, రీడింగ్ రూం దగ్గర 24 గంటలు మందులమ్మే మందుల దుకాణం. మరి తూర్పుగా వెళితే ముడసర్లోవ అనే పిక్నిక్ స్పాట్, పిల్లలు ఇష్టపడే జూ ఇత్యాదివి వున్నాయి.

ఎంత ప్రేమించినా, మనసు అక్కడే నిలిచి వున్నా.. ఉద్యోగ పరంగానో విధి లిఖితంగానో నేను ప్రేమించే ఊరికి అంటే 1984 తరువాత దూరంగా వున్నా.
.........
విసురజ

1 comment:

Unknown said...

మీ భావాలకు నమస్సులండి