

కవిత: భూర్జువ కేళి
.........................
రాజసంచూపి దర్పంగా నడిచొచ్చే రాబంధుని
కబంధ హస్తాల కామంధుని చూసా
ఉన్నతస్థానం మరచి ఉచ్ఛనీచాలు విడిచి
పెట్రేగి పోయే పశువాంఛని చూసా
భయంతో మందీ మార్బలం లేకుండ
బయటకు వెళ్ళలేని పిరికిపందను చూసా
అజ్ఞానపు ఉషస్సులో వింతగా శోభిస్తున్న
కామకేళి ఉత్సుకత సంరంభాన్ని చూసా
బ్రతుకు సైరంధ్రిలో నిర్జీవా శవాలపై
పైసలేరుకునే ధన పిశాచిని చూసా
జనాల వెతలు గరీబుల ఆకలికేకలు
వినబడని చెవిటి బధిరుడ్ని చూసా
కష్టాల సంద్రంలో బీదాబిక్కిలు మునిగిపోతున్న
చూడలేని పట్టించుకోని అంధుడ్ని చూసా
ఈ భూర్జువాల కేళికై చదునవుతున్న
బడుగులెముకల బొమికల రక్తార్పణలు చూసా
..........
No comments:
Post a Comment