
కవిత:రాధామాధవ ప్రేమామ్రుతం
.............
మదిలో మెదిలే తలపుల
తలుపులు తెరిచి చూడు చెలి
మనోనేత్రంతో మెరిసే మెరుపుల
వెలుగులు రసరమ్యత చూడు మరి
వర్షవేళ నింగిలో హరివిల్లు
వెల్లివిరిస్తే కడు రమ్యం
ప్రేమవేళ హ్రుదిలో అనందాలు
కురిసి మురిస్తే రసరమ్యం
ఎగిసిపడినురగలు కక్కే కెరటాలల్లే
మదిలో చెలరేగే ఎన్నెన్నో భావాలు
కురిసి తడిపి పోయే ప్రేమమేఘమే
హ్రుదిలో చిలకరించే స్వాతి చినుకులు
పిలుపే రాక మనసే
వగచి వేసారితే విషాదమే
రాకరాక వలపే వచ్చి
మనసార పలకరిస్తే అనందమే
వెన్నెల వేళలలో మోహనుడి
మురళీగాన మాధుర్యం మహదానందమే
నీలాల కన్నులలో సరసుడి
ప్రియప్రేయసి రూపసౌందర్యం అద్వితీయమే
No comments:
Post a Comment