ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 26 December 2013

కవిత: 'సలాం' సందిగ్దమా 
.........................
పలుకలేని భావాలెన్నో
ఎదలో ప్రశ్నలై పల్లవించే

మీటగలేని రాగాలెన్నో 
హృదివీణే తీపిగా సవరించే

చేజారిన చందమామే
పాలవెన్నెల చల్లగా కురిపించే 


చెడిందనుకున్న గళమే
కల్యాణిరాగం కమ్మగా ఆలపించే

తొందరపెట్టిన ప్రాయమే
పాశంకి తొడపాసం పెట్టించే

ప్రతిస్పందించని వలపే
మనసుకు వీవెనలు అందించే

భాగ్యమని మురవనా
సమయం దాటిందని వగవనా

ఏమిటీ అయోమయం
మనసుబాటలో ఎందుకందును గరళం
.........

No comments: