ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

PhotoPhoto


కవిత: వ్రుధా బాధా
.....................
ఆవిరై నింగికెగసి మేఘంలా రూపుమార్చి 
చినుకై అవనిపై కురిసేసి కర్సయిపోతేట్టా 
ఆవిరివై మేఘమై పిదప వర్షమై పలకరించక 
వెళ్ళితే కినుక వహించదా మా భూమి మాగాణి అంతా 

పొలాలలో కష్టించేవాళ్ళ కోసమైనా చల్లగా కురుసిపో మబ్బమ్మా
బీదలను బాధించక మా బీడులను సశ్యశ్యామలం చేసిపో స్వచ్చమమ్మా
బావుల్లో చెరువుల్లో మా ఇంటి గుండిగీల్లో నిండిపో చినుకమ్మ
బాధలు భయాలను మా గుండెల నుంచి దూరంగా తరిమేయవమ్మా

వ్రుదాగా మారే ప్రతి నీటి బొట్టు గొడవపెట్టే
తనని సమంగా దాచుకొమ్మని సరిగ్గా వాడుకొమ్మని
రాబోయే కాలంలో జరిగేవి నీటి యుద్దాలేనని చాటిచెప్పే
చేజారిన ప్రతిక్షణం అనుక్షణం గగ్గోలుపేట్టే
గడిచిపోయిన కాలం తిరిగిరాదని పద్దతిగా సాగమని
లేదంటే అక్షువులు కార్చేవి నీళ్ళు కాదు రక్తాశ్రువులే
..........

No comments: