ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

Photo: నీ సుందర ముఖారవిందాన్ని 
కనలేని నా బాధని అర్ధం చేసుకోకుండా 
ఎందుకలా కనుమరుగవుతావు కన్నయ్య
నీ దర్సనం కోసం వేచి చూస్తున్నాను.
కనలేని అందాన్ని కన్నుల్లో దాచావు
ఎనలేని మమతల్ని మదిలోగిలిలో నిలిపుంచావు 
పూబాలల నెత్తావుల్ని తనువంతా ధరించావు 
చెలువము మెచ్చిన చెలిమిని పల్లవించావు 
మనసైన నేస్తమా హ్రుదయాలయంలో దీపమైనావు 
దాచలేని ఓపలేని అనురాగ సమీరాల గిలివైనావు 
.....
విసురజ

నీ సుందర ముఖారవిందాన్ని 
కనలేని నా బాధని అర్ధం చేసుకోకుండా 
ఎందుకలా కనుమరుగవుతావు కన్నయ్య
నీ దర్సనం కోసం వేచి చూస్తున్నాను.
కనలేని అందాన్ని కన్నుల్లో దాచావు
ఎనలేని మమతల్ని మదిలోగిలిలో నిలిపుంచావు 
పూబాలల నెత్తావుల్ని తనువంతా ధరించావు
చెలువము మెచ్చిన చెలిమిని పల్లవించావు
మనసైన నేస్తమా హ్రుదయాలయంలో దీపమైనావు
దాచలేని ఓపలేని అనురాగ సమీరాల గిలివైనావు
.....

No comments: