ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 24 December 2013

Photo: Radha Rani gaaru పోస్ట్  చేసిన ఈ క్రింద గుడ్ మార్నింగ్ పోస్ట్ కు  
.......................
ప్రకృతి కాంతకు ఈ శిశిరం చేసే హేమంతపు సీమంతం నాకెందుకో నచ్చదు. ఈ అద్భుత సృష్టి అంతా నిస్సారంగా మారిపోతుంది. మోడులయిన చెట్లు, నిర్వీర్యంగా తన తల్లి పాదాల చెంతే రాలిపడిన ఆకులు, చల్ల గాలి వీచటం తో కొన్ని నేల లోకే పూడుకు పోతూ, మరి కొన్ని ఎటో ఎగిరిపోతూ, నెమ్మదైన నదుల ప్రవాహాలు, ఒక పల్చని కెంజాయ రంగు సంధ్య చాయలు పరుచుకుంటూ తొందరగా ముసురుకునే చీకట్లు.. చిగురాకులు, కోయిలలు, వసంతం ఎప్పుడొస్తాయో..........
//////////////
నేను రాసిన కామెంట్ 
................................
ప్రక్రుతి నియమాల నడవడికలో
నరుడి చొరబాటు నూటికి నూరుశాతం హానేగా
ఎదుగుట ఒదుగుట కొరకే
పెరుగుట విరుగుట కొరకే 
మోడువాడుట చిగురించుట కొరకే 
తిమిర నలుపు వేచేది ఉదయపు వెలుగుల కొరకే
తనువు కాలుతు కోరుకునేది మంచి మరుజన్మ కొరకే
.....
విసురజ

ప్రక్రుతి నియమాల నడవడికలో
నరుడి చొరబాటు నూటికి నూరుశాతం హానేగా
ఎదుగుట ఒదుగుట కొరకే
పెరుగుట విరుగుట కొరకే 
మోడువాడుట చిగురించుట కొరకే 
తిమిర నలుపు వేచేది ఉదయపు వెలుగుల కొరకే
తనువు కాలుతు కోరుకునేది మంచి మరుజన్మ కొరకే
.....

No comments: