ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

PhotoPhoto

భజన: సర్వం సాయిమయం 
.............................
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి 

పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి

రాధవి నీవే రమణుడివి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి

భాష నీవే భావానివి నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి

కవనం నీవే కవితాగానానివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి

ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి

జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి

ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి

గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి

వేదన నీవే వేడుకవి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి

గమ్యం నీవే గమనం నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి

సర్వం నీవే సకలం నీవే సాయి
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి

No comments: