

కవిత : నిరాడంబర తత్వం
.........................
కాపు కాసి విరగబూసి కాచిన పళ్ళన్నీ తుంచేస్తే
తరువు చిన్నబుచ్చుకోక మరోకరికి లాభించేనని ఆనందపడేగా
తరువు నిరాడంబరత తనువు నేర్చిన జన్మ సార్దకమవ్వుగా
బడలి సడిలి వడిలి పరుగులు తీసిన ప్రాయమే
గాయాల మయమై కాలమహిమలో శుష్కించితే
నిరాడంబర కాలం ఘనత తెలియక ప్రాయం కాయాన్ని కాలాన్ని దెప్పునా
ఉబికిన అవిరే ప్రేమతో నీలానింగి కెగసి మేఘమయ్యే
చినుకై కురిసి అపై వాగై వురికి చివరికి కడలికి చేరి సేదతీరే
ప్రేమతో నీ దరిచేర క్రిందకు తోసివేసావేందుకని నిరాడంబర ఆవిరి నీలాల నింగిని అడిగేనా
ఉరికే తరంగమే నురగలు కక్కుతు పరుగులు తీసే తీరానికై హుషారుగా
మనసురికే తురగమై పారేగా ఎదసొదలరొదలు వినిపించే చెలువము కొరకై మౌనంగా
నిరాడంబర తత్వాల మేలికలయకే జీవితాన మనుజుని గెలిపించే నమ్మకముగా
No comments:
Post a Comment