ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 24 December 2013

కంది వారు..కందులు ఎక్కువగా ఇష్టపడతారేమో 
గాది వారు..గాదులు నింపుకోవాలని వుంటుందేమో 
నేతి వారు..నెయ్యిని దంచికొడదామని చూస్తారేమో 
నోరి వారు..నోరెట్టుకుని అందరిమీదా పడిపోతుంటారేమో
నండూరి వారు..నంపుడు లేని వ్యవహారజ్ఞానని నమ్ముతామేమో

బండి వారు..బళ్ళ మీదా ఆదయంతో ధనవంతులయ్యేరేమో
పరిటి వారు..పూర్తి గ్రహణతో ముందుకు వెడుతుంటారేమో
పిరాట్ల వారు..పిలిచి పిలిచి అలసే వరకు పలుకరేమో
తిమ్మన వారు.. ఎమన్నా కిమ్మనకుండా వుంటారేమో
కంచర్ల వారు..కోటి కోటి కబుర్ల కులశేఖరుడవుతారేమో
మద్దాలి వారు..మగడ్ని మద్దెలదరువు ఆడిస్తారేమో

రాచూరి వారు..ఎడతగని రాచకార్యాలు చక్కబెడతారేమో
బులుసు వారు..భావుకతతో బ్రహ్మండంగా కడుపు నింపేస్తారేమో
చిత్రపు వారు..చిత్రవిచిత్రంగా అభిమానం వ్యక్తపరుస్తారేమో
ఈడూరి వారు..అద్దరి ఇద్దరి కాక నడుమునే ముంచుతారేమో
ఆదూరి వారు..ఆది అంతము లేని స్థితిలో వుంటారేమో

చేబ్రోలు వారు..చెయ్యతి మొక్కంగానే బ్రోచేస్తారేమో
వేమురి వారు..వాదవివాదాల్లో వాటి పరిష్కరణలో వుంటారేమో
ఇందూర్తి వారు..ఇది అదీ అని లేక అన్నిచోట్ల వుంటారేమో
కత్తుల వారు..మాటల కత్తులను పదాల ఒరలో దాస్తారేమో
ఆవంత్శ వారు..అద్భుత వాక్పటిమ ప్రదర్శిస్తూ వుంటారేమో

దేచిరాజు వారు..వరమిస్తామన్నా దేహి అనకుండా వుంటారేమో
వూటుకూరి వారు..ఊటలు ఎండని పదాల నిలువలు కలవారేమో
తంగిరాల వారు..తంపులు అందరికి తగిలిస్తుంటారేమో
ప్రతపగిరి వారు..ప్రతాపాల పెరుతో గిరులును ఎక్కుతారేమో
అశ్వాపురం వారు..పదాల అశ్వాన్ని సదా అధిరోహిస్తుంటారేమో

దేవరజు వారు: దేవదేవుల పేరు చెప్పుకుని రాజ్యం చేస్తారేమో
విస్సంరాజు వారు..విశ్వానికి రాజని చెప్పుకుంటుంటారేమో
మాంచిరాజు వారు..మంచికి ప్రతిరూపాలని అనుకుంటుంటారేమో
అందుకురి వారు..అందరికి అందకుండా కబుర్లతో కాలం గడిపేస్తారేమో
మేడపాటి వారు..మేడలు మిద్దెలు గురించి కలలు కంటారేమో

వెలిదిమళ్ళ వారు..వీలు చిక్కంగానే విసిగిస్తూ వుంటారేమో
యనమండ్ల వారు..ఎదురులేని పదవల్లరితో ఆడుకుంటారేమో
ద్రోణంరాజు వారు..ద్రోణులవంటి గురువులకే పాఠం చెబుతారేమో
అవసరాల వారు..అస్తమానూ వసారాలో చేరి పడుకుంటారేమో
న్యాయపతి వారు..న్యాయన్యాయాల గురించి లెక్చర్ దంచుతారేమో

దేవగుప్తపు వారు..ధారళంగా గుప్తమైన విషయ వివరణ చేస్తారేమో
కొచ్చర్లకోట వారు..కొంచెం కొంచెంగా మనసు మాట బయటపెడతారేమో
నిడసనమెట్ల వారు..నిదానంగా జీవన మెట్లు ఎక్కుతారేమో
తరిగొప్పుల వారు..తప్పొప్పుల పట్టికను తయారు చేస్తుంటారేమో
చిట్టిమూరి వారు..చిట్టి పొట్టి కబుర్లపోగు అయ్యుంటారేమో
పీసపాటి వారు..పిచ్చా పాటి కబుర్లకు తిరుగులేని మహరాజేమో
................
(సశేషం) 

No comments: