ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

వేడుకోలు వినిపించనా.. 
మనసే విన్నవించనా.. 
విధి బలీయమని విశ్వసించి ఊరుకోనా 
కాలవాహిని ప్రవాహాదారిలో
జనవాహిని తప్పక కలిసేను 
వీలు కాని ఉదయాలలో
వేరు కాని హృదయాలతో దూరతీరాలలో నిలిచేను 
ఊగి తూగే మమతల ఊయలలో 
మరీ మరీ మదిలో తలపే తడిమి పిలిచేను 
ఏమని చెప్పను ఏమని తెలుపను
తలపక్కడా తనువిక్కడాని ఎన్నిమార్లు వివరించను 
ఎడద తపనలూ ఎద నీదని 
తెలిపే మనసు మాట పెదవి దాటదదేమి 
అర్తిగా నిను అరాధించే నా కళ్ళే
నా మది వాకిళ్ళ లోగిళ్ళ చిరునామా నీకందించే 
పూర్తిగా నీ వశమైన ఈ తనువే
నా హ్రుదిలో కొత్త సందడులు సంగతులు తెలియపరచే 

No comments: