
కవిత: మీమాంశ
....................
మనసైన భామినివే మధుభావాల మాధురివే..
యవ్వనసౌరభ సుమగీతాల లావణ్య జవ్వనివే .. .
ముద్దుకే ముద్దొచ్చే మత్తైన ముగ్ధమోహనానివే..
మదీయ హ్రుదితలపులు తట్టిన ప్రేమకన్నియవే
వలపుమడుగులో నీ జతగా జలకాలాడనా..
మనసుప్రమిదలో నీ ప్రేమనే దీపంగా వెలిగించనా..
వయసుగడపలో నీ ప్రేమకై నీరీక్షించనా ..
ప్రేమసుమదళాలతో నీ హ్రుదినే ఆర్చించనా...
కనులకొలనులో నీ సొకునే పొందికగా దాచుకోనా
మదికడలిలో నీ మరులనే నావగా చేసుకోనా...
వయసువేడిలో నీ తలపుల వొడిలో నిదురోనా.
బ్రతుకుయానంలో నీ సొగసునే రధంగా మార్చుకోనా...
చెలి మనోహరి మనస్విని ప్రియే చారుశీలే
మందస్మిత మధురవాణి మల్లీశ్వరి ..
ఎట్ట్లా చేరాలి ఇన్నిటిలో నిన్ను ఏమని పిలవాలి
ఏమని కొలవాలి చిత్తముతో నీకే ఎట్టా చెందాలి
................
No comments:
Post a Comment