ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

తనువంత కళ్ళు చేసుకుని ఆర్తిగా ఎదురుచూసే 
చైత్రంకై వేచే ఆత్రపడు పెళ్ళిజంటలా 
తలపంతా మది కిటికీని తెరచి తొంగిచూసే
దాహానికై చూసే గొంతెండిన దాహార్తిలా 

వలపంతా విరిపుష్పమాలల సప్తవర్ణాల వరమాలలయ్యే 
మనసంతా కరిమబ్బులనుచూసి నాట్యమాడే నెమలయ్యే

No comments: