
తొలిపొద్దులోనూ మలిసంధ్యలోనూ దామోదరుడు కోరేది రాధనే
వెన్నెలలోనూ చీకటిలోనూ గోవిందుడు వెదికేది రాధనే
నవ్వుల పువ్వులలో కష్ట సుఖాల్లో చక్రపాణి అండ రాధనే
కేరింతలలో రసవత్తర ఆటలలో మాధవుడి తోడు రాధనే
పరువపు పరుగుల వాగుల్లో వయసు వరదల్లో శ్రీకరుడి ఇష్టసఖి రాధనే
వీచే మలయసమీరం వెన్నెలిచ్చే వెండిచంద్రుడు రాధకు మాధవుడే
పరవళ్ళ పారే యమున గానరసాల గంగ రాధకు మాధవుడే
ఆమని మెచ్చే చిలుకలు కూని రాగాల కోయిలలు రాధకు మాధవుడే
పాలు పితికినా వెన్న చిలికినా తలపుల్లో రాధకు మాధవుడే
పెదాలకు దిద్దే ఎరుపు బుగ్గల్లో విచ్చే సిగ్గు రాధకు మాధవుడే
రాధామాధవం అనిర్వచనీయ అనుభూతికి నిదర్శనం
రాధమాధవం యిరుహ్రుదయాల ఏకత్వానికి సంకేతం
రాధమాధవం ప్రక్రుతి పురుషుని సమాగమానికి చిహ్నం
రాధమాధవం వలపు తలపుల మమేకత్వానికి సుమార్గం
రాధమాధవం ప్రేమైక భావనకు సత్యం శివం సుందరం
No comments:
Post a Comment