ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 15 January 2014

గేయం: విజయ బాకా 
............................
ఆశల పల్లకీలో ఊరేగుతో 
అభివృద్ధికై అర్రులు చాస్తం 
ఊహలు నిజాలవ్వే యాతనావస్థలలో
ఆధునీకరణకు అస్సలు తావివ్వం
ఎలా సమిసేను మందబుద్ది 
ఎట్లా జరిగేను అభివృద్ధి 

నేర్పరిని అడ్డంకులు ఆపవు 
పరిజ్ఞానానికి పరిమితులు లేవు
జ్ఞానతృష్ణకు ఎల్లలు పెట్టలేం
విజయానికి గెలుపే సంకేతం
గెలుపుకి అపరిచుతులు వుండరు
ఓటమికి ఆత్మీయమిత్రులు ఎందరు

జననీ జనకుల ఆశయాలను వమ్ము చేయకండి
పేదల పెద్దవాళ్ళ మనసులను గాయ పర్చకండి
సువిశాల విశ్వంలో నిత్య జైత్రయాత్ర చేయండి
ప్రయత్నించక విజయ ఫలాలు అందవండి
నేర్వండి గెలవండి సూటిగా ముందుకు ధాటిగా సాగండి
నిన్న మరవండి నేడు కష్టిస్తే రేపు మీదేనండి 

No comments: