ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1) అర్హత లేని అందలం, ఆర్ద్రత లేని హృదయం, గౌరవం లేని పని ఎందులకు కొరగావు. వీటితో బాధే గానీ ఆనందం అందిరాదు.
2) తర్కంతో బ్రతుకు చిక్కుముడులు విప్పగలవు, విజ్ఞానంతో తర్కం అలవర్చుకోగలవు, విద్యతో విజ్ఞానం నేర్వగలవు, కాకపోతే ఈ పరిణామ క్రమంలో ముందునుంచి వెనక్కి గాక వెనకనుంచి ముందుకు సాగితే జీవనం సుఖమే లేనిచో కలవరమే.
......
విసురజ
పి.యస్.(నన్ను ప్రతి ఒక్కరు దూరంగా పెడుతున్నారు అన్న భావన కలిగితే ఒకమారు ఆత్మావలోకనం చేసుకుంటే తప్పు ఎవరిలో వుందో తెలుసుకోగలుగుతావు)

No comments: