కులగజ్జితో తనువంతా తగలేసేసే వాళ్ళు నికృష్టులు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
చదువుకున్న మూర్ఖులు ఛీ ఛీ అన్న దులుపుకు తిరుగుతారు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
పిల్లల మనసుతెలీని పెద్దలు కాదుకాదు దాష్టీకంచేయు గ్రద్దలు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
కన్నవాళ్ళ సౌఖ్యానికన్నా తమమాటే పెట్టన్న దురహంకారులు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
కష్టపడి చదివిస్తారు మరొకర్ని ఇష్టపడితే చీధరిస్తారు చంపేస్తారు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
మింగ మెతుకు లేకున్న పౌరషాగ్నిలో రగులుతారు బుద్దిహీనులు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
కుక్కలు మొరుగుతాయని తెలిసీకూడా పరులాడుమాటలకే ఉలిక్కిపడతారు ఉడుక్కుంటారు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
సమాజంలోని కుళ్ళును కడగకకుండా కుళ్ళుతోనే సమాజాన్ని నింపుతారు
మారరు వీళ్ళు మారరు
మారరు వీళ్ళు మారరు
అందుకే
ఈ రక్కసుల ఈ కులపిచ్చివాళ్ళ బండారం బయటపెడదాం
ఈ కర్కసుల ఈ ప్రేమరాహిత్యపు మడుసుల పనిపడదాం
మంచిగా చెప్పిచూద్దాం లేకుంటే బట్టలూడదీసి కొడదాం
పిల్లల మనసుతెలీని పెద్దలు కాదుకాదు దాష్టీకంచేయు గ్రద్దలు
మారరు వీళ్ళు మారరు అన్నమాటవీడి వీళ్ళు మారేదాక మోతమ్రోగిద్దాం
..........

No comments:
Post a Comment