ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1) నీ శక్తి మీద నీకే నమ్మకము లేకపోతే బయటవాళ్ళే కాదు సొంత మనషులు లెక్కచేయరు. నమ్మకం కరువైన చోట గౌరవం కలకాలం కాపురముండదు.
2) నిలకడ మరియు నిజాయతి లేక మనుజుని మనుగడ అర్ధరహితము. సొమ్ము సొత్తు ఎంతున్నా నిబ్బరము లేని బ్రతుకు ఈదురగాలుల్లో దీపం వంటిది). 
విసురజ
.....
పి.యస్..(నవ్వులాటకు కూడా మరొకరిని పలుచన చేయకు, మరొకరితో ఆటాడుకుంటే బలీయమైన విధి మనతో ఆడుకుంటుంది )

No comments: