ఆప్యాయంగా చిలక చుట్టి తాంబూలం అందించింది చెలియ చిలక
వద్దన్నా వలదన్నా వినక గోముగా ప్రేమగా ఆర్తిగా సంప్రీతిగా

సేవిస్తే తాంబూలం నా నోరేమో ఎర్రంగా పండింది భార్యపై ప్రేమ లక్షణంగా
మరి తన కళ్ళేమో ఎర్రెర్రంగా మండాయి ఎందుకో ఏమిటో కోపం కారణంగా

ముక్కు ఎగబీల్చడాలు గొనుక్కోడాలు పళ్ళాల చప్పుళ్ళు చూపుల విసుర్లు
ఆలి అలకలు చెప్పకనే చెప్పినవి ఎక్కడో ఎదో తిరకాసు జరిగిన సంబడాలు

నోరు విప్పి అడగబోవ నోట్లో చెలియ ప్రేమతో అందించిన తాంబూలమాయే
కాదని ఊసి అడగుదామనుకుంటే తనది చూస్తే చెప్పలేని గొడవా గోలాయే

బిర్రుబిర్రునా పరుగుపరుగున బజారుకు పోయి నూతన వస్త్రరాజములు కొంటి
చిర్రుబుర్రులాడు చెలియకే నవీనవస్త్ర బహుకరణ జరగ గృహశాంతి మనశ్శాంతి నొందే

ప్రేమమీర పడకటింటిలో చేరి చెలినే బామాలి బ్రతిమాలి కోప కారణం తెలిసి విస్తుపోతి
తెలిసిన కారణంతో విషయ వివరణతో తాంబూలం సేవనంతో తెగతెంపులు చేసుకుంటి

సేయంగ తాంబూల సేవనం చెలికై వేచాకనే తెలియకనే నిద్రలోకి జారుకుంటి
వంటిట్లో పిల్లాపాపల సేవలన్నీ సలిపి చెలినే చెంతచేర మూడోఝాములోనుంటి

హతవిధీ తాంబూలమా తాంబూలసేవనమా ఎంతపని సేస్తివి సేయిస్తివి
నిక్షేపంగా వున్నా నా ప్రాణాన్నీ వెతలలో పడేస్తిని డబ్బు దుబారా చేయిస్తివి

చెలియా కోపం నా మీదనైతే నా కోపం తాంబూలం సేవనంపై నిద్రావస్తాపై
మరోమారు ప్రేమగా చెలియే చిలక చుట్టిచ్చినా దుడ్డుగట్టితో వద్దు వద్దంటి

No comments:
Post a Comment