ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 10 October 2014

కవిత: సుమరాగ గానం

తడిసి విరిసిన కన్నెపూబాలల
నెత్తావులనే గ్రోలనా
కురిసే హిమవర్షపు మల్లెలనే 
మాలగా కట్టనా
పచ్చపచ్చని ఆకులను అల్లిబిల్లి తీవెలను
అల్లరగా తాకనా
మంద్రంగా సాగే వసంతయామిని
రాగాలాపననే విననా

తొలిచినుకు పుడమిని తడిమితే
మురిసిన అవని మందహాసంచేసే
మట్టివాసనలిచ్చే మౌజులో ధరణి
గతకాలపు ప్రాభవాలు విన్నవించే
వచ్చిపోయే ఋతువలన్నీ
మనసు తీరా పలకరించే
పుప్పొడుల సరాగాలకు
అల్లరి తుమ్మెదలు నర్తనచేసే
ఎదకనుమలలో సందేహాల సందోహం
రావచ్చిన మనసుమాటను ఆపివేసే
ప్రియకన్నులలో సిగ్గుల తులాభారం
తరలొచ్చిన సొబగుకు సోకులద్దే
మదిలోతులలో దాగిన వలపులను
హృదితలుపులు తెరిచి చెయ్యందించే
మనసు నీది సమత నీది
మదిమెచ్చిన మమత నీది
తలపు నీది వలపు నీది
తనువిచ్చిన కలలవీధి నీది
ప్రియసేవలు సేయనా మనసార
జీవితమంతా అర్చించనా మనసుతీరా
........
విసురజ

No comments: