ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: కడలి

తెలుపు తరకల మెరుపులతో ధగధగా వెలిగే కడలి 
పాలనురగల నడకల విరుపులతో వయ్యారంగాకదిలే కడలి 
తేడాపాడాలక్షణాలు చూపక చకచకాపరుగుతో కదిలే కడలి 
పడిలేస్తూ ఉరకలేస్తూ ఒడ్డునముగ్గులేస్తూ తుడుస్తూ కదిలే కడలి
ఉందోలేదోతెలీని నింగిని అందాలని తాక ఎగిసిపడే కడలి
అనంతవినీలానికి తనఛాయతో నీలి రూపమిచ్చే కడలి
పతితులైనా పావనులైన మధుపానులనైనా చూసే ఒక్కలానే కడలి
కడకుకలిసే నదులన్నిటిని ఆక్షేపణచేయక అక్కునచేర్చుకునేది కడలి
పున్నమినాడు పరవశంతో పరవళ్ళుతొక్కు అందరినలరించు కడలి
రవిచంద్రుల రాకపోకలకు నిత్యకర్మణసాక్షిగా చీకటివెలుగుల్నిచ్చే కడలి
అలసిన మనసులను ఆహ్లాదపరచి అల్లరిప్రేమికులను అలరించేది కడలి
పిండివెన్నెలలో ఇసుక తిన్నెలను దాపుగా అందించేది కడలి
కడలి చెప్పే జీవనసార కధలెన్నో..పడిలేవాలని, పట్టువిడవరాదని
బెట్టుచేయరాదని, కల్మషాలేన్నైనా ఒకేలా చూడాలని 

No comments: