ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: మది పలుకు

మనసు తోట పుష్పిస్తే
బ్రతుకు పూల బాటయ్యే
తలపు ప్రేమతలుపు తీస్తే
వయసు వలపుదోవ తొక్కే
చూపులే ఎద నాటుకుంటే
పలుకే తీపి చెరుకుగడయ్యే
చెలిమి చేవ తెలిసివస్తే
కలిమి నోటు అందినట్టే
మహిలో మదికి విలువిస్తే
తుదిలో హృదికి విలువందే
నవ్వుల నెలరాజు నీవైతే
వన్నెల దొరసాని నేనౌతా
విరుల తావి నీ సంబడమైతే
మరుల వీధి నే కాపురముంటా
అందాల ఆత్మీయం పరిమళిస్తే
బంధాల మణిహారం పలకరించే 

No comments: