జనపాలుడు జనకునికి
ధరణిపుత్రి దత్తపుత్రికగా దొరికే
ధరణిపుత్రి దత్తపుత్రికగా దొరికే
బాలాసుకుమారి దివ్యసుందరరూపం
నరపాలుని మదికిచ్చే అలవిలేనిసంతసం
నరపాలుని మదికిచ్చే అలవిలేనిసంతసం
జనకునిబాల ఎదిగినవేళ
అమ్మడిపెళ్లికై తండ్రి తహతహపడే
అమ్మడిపెళ్లికై తండ్రి తహతహపడే
లోకసుందరికి జోడెవ్వరోనని
వైదేహితండ్రి సోచిస్తూ వ్యాకులపడే
వైదేహితండ్రి సోచిస్తూ వ్యాకులపడే
శివధనుస్సును ఎక్కుపెట్టేవాడే
జానకిని చేపట్టే వరుడనిప్రకటించే
జానకిని చేపట్టే వరుడనిప్రకటించే
జనకపుత్రి స్వయంవరం
తరలివచ్చిరి ఎందరో ధరణీవల్లభులు
తరలివచ్చిరి ఎందరో ధరణీవల్లభులు
యాగరక్షణార్ధం కానలకేగినాడు
రాజర్షీ లక్ష్మణుడితోసహా దశరధప్రధముడు
రాజర్షీ లక్ష్మణుడితోసహా దశరధప్రధముడు
విశ్వామిత్రుని యాగరక్షణచేసి
సీతాస్వయంవరానికి గురులక్ష్మణులతోడుగా విచ్చేసే దాశరధడు
సీతాస్వయంవరానికి గురులక్ష్మణులతోడుగా విచ్చేసే దాశరధడు
ముక్కంటిప్రసీదమైన సదాశివునివిల్లుని
పుడమీపాలకులు ఎత్తలేక కుదేలుపడిరి
పుడమీపాలకులు ఎత్తలేక కుదేలుపడిరి
సిగ్గరిసీతకి పరిణయమవదా
జనకహృది కల్లోలపడే బెంబేలుచెందే
జనకహృది కల్లోలపడే బెంబేలుచెందే
ప్రబలకారుల ప్రభలువెలవెలపోవ
గురువాజ్ఞతో రాఘవుడు సభామధ్యమునకేగే
గురువాజ్ఞతో రాఘవుడు సభామధ్యమునకేగే
కలికికులుకుతు ఓరకంటచూస్తుండ
విల్లునెత్తి కౌసలేంద్రుడు ఎక్కుపెట్టివిరిచేసే
విల్లునెత్తి కౌసలేంద్రుడు ఎక్కుపెట్టివిరిచేసే
ముదమున చిరునగవులుచిలుకుతు
వడివడిగా అడుగేసేసీత వరమాలతో
వడివడిగా అడుగేసేసీత వరమాలతో
నవ్వులరేడు నీలమేఘశ్యాముడు
చిత్తహరిణి పున్నమిరూపిణి వరమలగ్రహించే
చిత్తహరిణి పున్నమిరూపిణి వరమలగ్రహించే
సీతాస్వయంవరమనే అంకంతో
రాముడు(వైకుంఠనాధుడు) సీత(చంద్రసోదరి..లక్ష్మి) ఒక్కటైరి
రాముడు(వైకుంఠనాధుడు) సీత(చంద్రసోదరి..లక్ష్మి) ఒక్కటైరి

No comments:
Post a Comment