ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1)ప్రతి విషయాన్నీ సునిశిత దృష్టితో పరికించి, సమగ్రంగా పరీక్షించి, దూరదృష్టితో అలోచించి, స్పష్టతతో ప్రతిస్పందిస్తూ లక్ష్యంవైపు అడుగేస్తూ విజయతీరంలో అడుగిడితే దక్షుడిగా తెలియగలవు..లబ్దప్రతిష్టుడిగా నిలిచేవు.
2)చెప్పుడు మాటలు చెప్పే నోరు కంటే వినే చెవులే దోసమే కాస్త ఎక్కువ. ఎందుకంటే విని, వాటిని నమ్మి, తప్పటడుగు వేసి సమస్యలు తెచ్చుకున్న, లేక సృష్టించినా ఆ అపరాధం సదరు చెప్పుడు మాటలు విన్న చెవులదే, వాటిని నమ్మిన బుద్దిలేని జీవిదే.
*****
విసురజ
..........
పి.యస్..(ప్రేమని ప్రేమగా అందితే హిమపాతంలా చల్లగా హాయినిచ్చు మరదే ప్రేమే వికటిస్తే జ్వాలై, ప్రళయమై కబళించు)

No comments: