ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: మగువ విలువ

కష్టమని ప్రాణాంతకమని తెలిసీ
మరోతరానికి నవచైతన్యానికి జన్మనిచ్చే జాహ్నవి మగువే
చిన్ననాడు ఆటలలో అల్లరిలో
చేదోడువాదోడుగా వెనక వుండే తోబుట్టువు మగువే
ఆకలివేళ కడుపు కనుక్కుని
ఆకలితీరేలా ఆత్మీయంగా అన్నంపెట్టే అమ్మ మగువే
పెరిగిపెద్దయినాక అనురాగం అంకురిస్తే
తోడుగా జోడుగా కలిసుండే కన్యారత్నం మగువే
నచ్చుకుని మెచ్చుకుని చేయిపట్టుకుంటే
కట్టెగాకాలేదాకా క్రీనీడలా వెన్నంటివుండే భార్యా మగువే
సర్వవేళలా సర్వత్రా మగపుంగువులకు
బుద్దిబలంతోప్రజ్ఞతో ఇంటాబయటా గెలిచిగెలిపించే ఇంతిపూబంతి మగువే
...............

No comments: