ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:మది అలోచనలు

రవికిరణాల అత్మీయ పలకరింపు
పుడమికి పులకరింపుల మేలుకొలుపు
మనోరధమనోహరి మనోహర ముసిముసినగవులే
చెలువముమెచ్చే జతగానికి సంబరస్మ్రుతులు
విచ్చిన విరజాజితీవే తావే 
తుమ్మెదలకు చుంబనాలింగనాల అహ్వానాలోసిగే
ప్రాయపుపరువాల జలజ సిగ్గునిగ్గులే శరత్చంద్రుని వెన్నెల వన్నెలవెలుగులు

వలచినవిరిబోణి పయ్యేదల(ఓణి)రెపరెపలే
మనసిచ్చిన మగని మనసులో రేపు కలలు కలవరాలు
సన్నగ వీచే పిల్లతిమ్మెర ప్రియ సేవలే
ప్రేమాగ్నిలో రగిలే ప్రియులకు ఊరటనిచ్చే ఔషధాలు
తీపినవ్వుల సిగ్గరి సుందర సొట్ట బుగ్గలే
ప్రియపురుషుడి మది ఆకలిని తీర్చే స్నేహబూరెలు
చిలక పలుకుల చెలి చేతికి
చిట్టిచేమంతులిచ్చి నను చేపట్ట రారమ్మననా
కులుకు సోయగాల సౌధామిని సోకుకి
ప్రేమపౌడర్లు వలపత్తర్లుతో ప్రణయవార్త తెలియచెప్పనా
నుడుముందో లేదో తెలియని నవయవ్వన మోహినికి
పసిడిమనసుతో వలపునే వడ్డాణంగా చేసి కానుకివ్వనా
ఆత్మజకు తెలిసిన వలపునే తెలిపితే
ప్రేమజీవితం ఈ ఉషోదయంతో తెల్లవారేనా
కోరి మెచ్చిన చెలి ప్రభలు
నా చీకటిబ్రతుకులో కాంతిరేఖలు ప్రభవించేనా

No comments: