ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:చంద్రాయణం

ఒక్కతూరి మేఘాలు కమ్ముకొస్తే
ఉక్కిరిబిక్కిరి అవుతావేమి వెన్నెలరాజా
సందుదొరికితే ఆలుమగల మధ్యలో
పిలవనిపేరంటంలా వస్తావేమి నెలరాజా
మాటిమాటికి కలువమ్మని కలవరిస్తున్నావంటే
తడబడి హైరానాపడతావదేమి శ్రీసోదరా
నలుపుతెలుపుల సందెమ్మకు నజరానాలివ్వ
త్వరపడివచ్చేవు పిండివెన్నెలతో జాబిలిరాజా
అదిచేసి ఇదిచేసి నింగి తారలతో సరాగం చేసేవు
ధరజనులను మాయమొహంలో ముంచేసి క్రొత్త సరదాసరసాలు నేర్పేవు
భవ్యమైనా ఇది భావ్యమేనా చందూరుడా 

No comments: