నిద్రకరువై బ్రతుకు బరువై
మెలుకువగా చాలాసేపు మసిలా
ఎదలోతులలో నీకై వేచి వేచి
ఒంటరిగా ఒంటిగా మిగిలా
వలపుముంగిళ్ళలో మాటిచ్చి రాని
నీకై వగచి వేసారి రగిలా
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
మెలుకువగా చాలాసేపు మసిలా
ఎదలోతులలో నీకై వేచి వేచి
ఒంటరిగా ఒంటిగా మిగిలా
వలపుముంగిళ్ళలో మాటిచ్చి రాని
నీకై వగచి వేసారి రగిలా
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
మత్తుకళ్ళ రేయమ్మ గమ్మత్తుగా
చీకటి చీరకుచ్చెళ్లు సవరించుకుంటోంది
వేకువకి మరికాస్తసమయమే మిగులుంది
తెల్లవారనీ ఈబ్రతుకును కాస్తతెల్లవారనీ
అంతదాకా మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
చీకటి చీరకుచ్చెళ్లు సవరించుకుంటోంది
వేకువకి మరికాస్తసమయమే మిగులుంది
తెల్లవారనీ ఈబ్రతుకును కాస్తతెల్లవారనీ
అంతదాకా మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
మరోమారు మగతగా నిద్రలోకానికి వెళ్లి
సంపూర్తికాని ప్రీతికరమైన కలలరంగుల్ని
మనసుమెచ్చే సప్తవర్ణాలతో మనసారా నింపని
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కనులారా నిద్రోని
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
సంపూర్తికాని ప్రీతికరమైన కలలరంగుల్ని
మనసుమెచ్చే సప్తవర్ణాలతో మనసారా నింపని
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కనులారా నిద్రోని
అందుకే మరి కూసింతసేపు సద్దుసేయక
నన్ను కడుపారా నిద్రపోని
No comments:
Post a Comment