ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: గణతంత్రమా నీకు జేజేలు

దేశానికి గౌరావాన్నిచ్చే
భారత గణతంత్ర దినోత్సవ శుభదినమా నీకు జేజేలు
సర్కారి పద్దతులలో లెక్కించి 
గుణవంతులను కీర్తించే కాలమా నీకు జేజేలు
నీ రాకతో పలకరింపుతో
దేశభక్తి గీతాలు కవితలు పుట్టుకొచ్చే కోకొల్లలు
అచ్చటా ముచ్చటా తీరంగా
నువ్వు మరురోజు కాగానే గుర్తుచేసుకునేది ఎందరు
అరవై వసంతాలుగా ఆనందంతో సదా
ఈ పండుగను అందరం జరుపుకుంటున్నాం
నిండుగా కప్పుకోలేని అరపొట్టైనా నిండని
కాలే కడుపుల బడుగులును మరుస్తున్నాం
ఓ జనులారా విలువైన ఓటరులారా
నోటుకీ బుడ్డీకీ కులమతగజ్జికీ శెలవిప్పించండి
ఓ సిసలైనా భారత భాగ్యవిధాతలారా
ప్రాంతీయ భేదాలను మతతత్వాలను దునమండి
సమతే భరతజాతికి ప్రభలు వెలుగిచ్చే భవిత
యువతే కావాలి సమస్త రాజకీయాలకు బాసట
చేయి చేయి కలిపి సాగుదాం ప్రగతిబాట
కీర్తిద్దాం భరతమాతను తెలుగుతల్లిని ప్రతిపూట
దేశానికి గౌరావాన్నిచ్చే
భారత గణతంత్ర దినోత్సవ శుభదినమా నీకు జేజేలు
............
విసురజ

No comments: