ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:కన్నీళ్ళ విలువ

కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
బంగారుజింకకై పట్టుబట్టి పతిరాముడిని ఎడబాసినందుకు రాణి సీత కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
రాని వేణుధరునికై బృందావనంలో వేదనతో రాణి రాధ కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది 
కురుసభలో పంచభర్తల భానిసావస్త చూసిన రాణి పాంచాలి కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
మోహాల ఊభిలో నలిగిన మనసులవస్తను చూసిన రాణి ప్రేమ కంట
కన్నీళ్ళ గోదావరి వెల్లువై పారింది
భువిలో మోసాలరారాజుల పేట్రిగిపోవడం
చూసిన భూరాణి ధరిత్రి కంట 

No comments: